: ఎన్డీయేలో చొరబాటుకు యత్నం.. కాల్పులు.. ఒకరి మృతి


పూణేలో ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చొరబడేందుకు ఐదుగురు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ రోజు తెల్లవారు జామును భద్రతా దళాలు గస్తీ తిరుగుతుండగా వారి ప్రయత్నాన్ని గమనించిన భద్రతా దళాలు వారిని ఆక్కడే ఆగమని హెచ్చరించారు. దీంతో వారు ఆగకుండా భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరుపడంతో వారిలో ఒక వ్యక్తి మరణించగా మిగిలిన వారు పారిపోయారు. ప్రపంచంలోనే ఉత్తమ సంస్థల్లో ఒకటయిన ఎన్డీయే వద్ద ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News