: శాంతి కోసమే వీహెచ్ పీ యాత్రపై నిషేధం: యూపీ మంత్రి అజంఖాన్
రాష్ట్రంలో శాంతికి, మతసామరస్యానికి భంగం వాటిల్లరాదనే అయోధ్యలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) తలపెట్టిన యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ చెప్పారు. కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. చౌరాసి కోసి యాత్ర పేరుతో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 13 వరకు వీహెచ్ పీ అయోధ్యలో యాత్రను తలపెట్టింది. ఇందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అయినా సరే యాత్రను నిర్వహించి తీరుతామని వీహెచ్ పీ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ స్పష్టం చేశారు.