: సచివాలయంలో కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఈ రోజు కూడా విధులను బహిష్కరించారు. దీంతో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల నిరసన 24 వ రోజుకు చేరుకుంది. మరోవైపు ఎర్రమంజిల్ లోని జలసౌధ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జలసౌధలో సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు తులసిరెడ్డి జలసౌధకు చేరుకున్నారు. దీంతో ఇరు ప్రాంత ఉద్యోగులు జలసౌధను నినాదాలతో హోరెత్తించారు.