: రాహుల్, మోడీ ప్రధాని పదవికి తగరు: అన్నా హజారే


ప్రధాని పదవికి రాహుల్ గాంధీ లేదా నరేంద్ర మోడీ సరిపోరని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. భారత రాజ్యాంగం రాజకీయ పార్టీలను గుర్తించదని, వీరిద్దరూ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారేనని అన్నా హజారే అన్నారు. కనుక ప్రధానిగా వీరిని అనుమతించబోమన్నారు. రెండు వారాల అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న మేరీలాండ్ వర్సిటీలోని భారతీయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్దంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. కనుక ప్రధాని, రాష్ట్రపతిని నేరుగా ఎన్నుకునే విధానంపై భారత ప్రజలలో అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. ప్రధానిని ప్రజలే ఎన్నుకునేలా సిస్టం ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల విధానంపై ఆధిపత్యం చెలాయిస్తున్నంత కాలం భారత్ మంచి ప్రధానిని పొందలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News