: మళ్లీ కమిటీ అంటే తీవ్ర పరిణామాలు: హరీష్ రావు
తెలంగాణపై మరోసారి కమిటీ వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీఆర్ఎస్ నేత హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైతే ఈ ప్రాంతంలో శాంతి కొరవడుతుందన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ వైఖరి అనుమానాస్పదంగా ఉందని, దీనిపై సుష్మాస్వరాజ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హరీష్ రావు నందమూరి హరికృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు బాలకృష్ణతో కలిసుండలేని వాడు తెలుగు వారంతా కలిసి ఉండాలని కోరుకోవడమేంటని ప్రశ్నించారు. తండ్రి ఆశయ సాధన కోసం రాజీనామా చేశానని చెబుతున్న హరికృష్ణ నాడు బావ చంద్రబాబు కోసం ఎన్టీఆర్ పై చెప్పులు వేయించాడని అన్నారు.