: ఆంటోనీ కమిటీకి వివరించాం.. కమిటీ స్పందించలేదు: గాదె
కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిపై సీమాంధ్రకు చెందిన నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత గాదె కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంటోనీ కమిటీకి సీమాంధ్రకు సంబంధించిన అన్ని అంశాలను వివరించామని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పార్టీ అధిష్ఠాన వైఖరిని ఆయన ఖండించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల లీజు సొమ్ముతోనే నిజాం నవాబులు హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని తెలిపారు. సీమాంధ్రలో టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీలకు ప్రాతినిధ్యమే లేనప్పుడు విభజనను అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాయనడం సరికాదని దిగ్విజయ్ సింగ్ కు హితవు పలికారు.