: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకుంటాం: ఓయు జేఏసీ
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నేత హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపధ్యంలో అతని కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని ఓయు విద్యార్ధి జేఏసీ హెచ్చరించింది. జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్యా' చిత్రం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.