: 2జీ కేసులో కురుణానిధి భార్యకు మినహాయింపు


2జీ స్పెక్ట్రంపై కేసులో వ్యక్తిగత హాజరునుంచి డీఎమ్ కే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ కు సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ కేసులో అమ్మాళ్ ను చెన్నైలోని వారి నివాసంలోనే విచారించేందుకు ప్రత్యేక విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అనారోగ్యం కారణంగా తాను ఇంటినుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితిలో ఉన్నానంటూ ఎయిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్టిఫికెట్లను న్యాయస్థానానికి సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News