: అవార్డుల ఖాతా తెరిచిన 'లైఫ్ ఆఫ్ పై'
పలు విభాగాలలో ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతున్న 'లైఫ్ ఆఫ్ పై' చిత్రం మొదట్లోనే ఖాతా తెరిచింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సినిమాటోగ్రఫీ (క్లాడియో మిరండా) విభాగాలలో 'లైఫ్ ఆఫ్ పై' ఆస్కార్ గెలుచుకుంది. పలు అంచనాలున్న మరో చిత్రం 'లింకన్' మాత్రం ఇంకా ఎకౌంట్ ఓపెన్ చేయలేదు. ప్రస్తుతం అవార్డుల వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో ఉల్లాసంగా జరుగుతోంది.