: షిండే అబద్దాలు చెబుతున్నాడు: మైసూరారెడ్డి


రాష్ట్ర విభజనకు అనుకూలంగా వైఎస్సార్సీపీ లేఖ ఇచ్చి తరువాత మాట మార్చిందని బురదజల్లుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి తెలిపారు. గుంటూరులో విజయమ్మ దీక్షాశిబిరాన్ని సందర్శించడానికి వచ్చిన మైసూరా రెడ్డి మాట్లాడుతూ షిండే అబద్దాలు చెబుతున్నాడన్నారు. కుటుంబ పెద్దలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని షిండేకు చెప్పామని, అంతే కానీ విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వలేదని అన్నారు. తమ పార్టీ వెల్లడించిన విషయాలన్నీ పక్కన పెట్టిన షిండే, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం ఆయన అలా మాట్లాడుతున్నారని మైసూరా ఆరోపించారు.

  • Loading...

More Telugu News