: ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విడదీసిన తీరు బాధాకరం: సుష్మాస్వరాజ్


ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విడదీసిన తీరు ఆందరినీ బాధిస్తోందని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. అందుకే సభలో రగడ జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజన తీరుపై సొంత పార్టీ ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారన్నారు. ఎక్కడా రక్తపు చుక్క రాలకుండా, సద్భావన చెడకుండా తమ హయాంలో మూడు రాష్ట్రాలను విభజించామని సుష్మ గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అనుచితంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News