: ప్రధాని ఫైళ్లకు సంరక్షకుడు కాదు: కమల్ నాథ్ వ్యాఖ్య
బొగ్గు శాఖ ఫైళ్లు గల్లంతుపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలంటూ నాలుగు రోజులనుంచి చేస్తున్న బీజేపీ డిమాండు పార్లమెంటు సమావేశాలను స్థంభింప జేసింది. దీనిపై ఇప్పటికే బొగ్గు శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ వివరణ ఇచ్చినా చల్లబడని ప్రతిపక్షాలు రోజూ గందరగోళం సృష్టిస్తూనే ఉన్నాయి. దీనిపై తీవ్రంగా మండిపడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్.. ప్రధాని ఫైళ్లకు సంరక్షకుడు కాదని,ఆయన స్టోర్ రూమ్ లో కూర్చోవడం లేదన్నారు. వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. సమావేశాలకు అంతరాయం కలిగించాలంటే బీజేపీకి అనేక సాకులు ఉన్నాయని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు.