: రాష్ట్రవ్యాప్తంగా నేడు 'మనగుడి'
శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న'మనగుడి' కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తిరుమలలో ప్రారంభించారు. టీటీడీ, రాష్ట్ర దేవాదాయ శాఖ సంయుక్తంగా మూడో విడత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని 21,142 ఆలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అవసరమైన వస్త్రాలు, కంకణాలు, పూజా సామగ్రిని ఆయా ఆలయాలకు టీటీడీ ఇప్పటికే సరఫరా చేసింది.