: అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకోనున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు


సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధిష్ఠాన పెద్దలపై గుర్రుగా ఉన్నారు. ఢిల్లీలో రాత్రి ఆంటోనీ కమిటీ సభ్యులతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమావేశమై తమ ఆందోళనను తెలియజేసిన సంగతి తెలిసిందే. తమ ప్రాంతంలో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చారని, విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. కానీ, ఆంటోనీ కమిటీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీనిపైనే వారు ఆగ్రహంగా ఉన్నారు. తమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంటే, ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంటే, కమిటీ అవేమీ పట్టనట్లు వ్యవహరించిందని, అది భావ్యం కాదంటున్నారు.

ఈ నేపథ్యంలో అధినేత్రి సోనియాగాంధీని కలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సోనియా నుంచి హామీ లభించకపోతే, తెలంగాణ విషయంలో ముందుకే వెళితే, వారు పార్టీ నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆయన కూడా సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ కేంద్రంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News