: బీహార్ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన
బీహార్ లో జరిగిన రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధమారా రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని మృతి చెందిన శివభక్తుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి ఖర్గే వెల్లడించారు. కాగా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడినవారికి లక్ష రూపాయలు పరిహారంగా అందజేయనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.