: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ కొట్టిన ధోనీ..భారత్ 515/8
చెన్నై టెస్టులో భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెలరేగాడు. టెస్టులో తన తొలి డబుల్ సెంచరీ (206 నాటౌట్)ని పూర్తి చేశాడు. భారత్ -ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న ఈ మ్యాచులో కేవలం 231 బంతుల్లో 5 సిక్సర్లు, 21 ఫోర్లు బాదిన ధోనీ.. మెరుపు వేగంతో డబుల్ సెంచరీ చేశాడు.
ఈ డబుల్ సెంచరీతో భారత టెస్టు జట్టు కెప్టెన్లుగా డబుల్ సెంచరీలు చేసిన సచిన్ (217), గవాస్కర్ (205), పటౌడి (203‘)ల సరసన ధోనీ చేరాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 515 పరుగులు చేసింది. ధోనీతో పాటు టెయిలెండర్ భువనేశ్వర్ కుమార్ (16 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో పాటిన్సన్ 4, లియాన్ 3, హెన్రిక్స్ ఒక వికెట్ పడగొట్టారు.

- Loading...
More Telugu News
- Loading...