: సోనియాది తెలివితక్కువ నిర్ణయం: వీరశివారెడ్డి


కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి.. సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయం సోనియా గాంధీ తెలివితక్కువ తనంతో తీసుకున్నదేనని అన్నారు. విభజన నిర్ణయం వాపస్ తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమవుతుందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్ల తెలంగాణలో కేసీఆర్ హీరోగా మారతాడని, దాని వల్ల కాంగ్రెస్ పార్టీ జీరోగా మారిపోతుందని తెలిపారు. కేసీఆర్ ను విలీనం చేసుకున్నా అతను కాంగ్రెస్ లో ఇమడలేడు కనుక కాంగ్రెస్ ను వీడి మళ్లీ వేరు కుంపటి పెట్టుకుంటాడని, అందువల్ల కాంగ్రెస్ కు అక్కడ ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతానికి ఉన్న వారంతా తెలివిలేని నాయకులేన్నారు. ఏకపక్ష నిర్ణయం కారణంగా సీమాంధ్రలో కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి లేదని తేల్చేశారు. సమైక్యాంధ్ర కోసం వీరశివారెడ్డి శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News