: వీహెచ్ పై దాడి కేసులో అరెస్టైన సమైక్యాంధ్ర నేతలు విడుదల
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై దాడి కేసులో అరెస్టయిన సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. సీమాంధ్ర ప్రజలపై వీహెచ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మూడు రోజుల కిందట తిరుపతిలో ఆయన కారుపై సమైక్యాంద్ర నేతలు చెప్పులు విసిరి అడ్డుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.