: అథ్లెటిక్ ఫెడరేషన్ పై మండిపడ్డ సాయ్
అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) మండిపడింది. ఆసియన్ యూత్ గేమ్స్ లో భారత అథ్లెట్ల ఘోర వైఫల్యంపై సాయ్ విమర్శల వర్షం కురిపించింది. నాన్జింగ్ కు 27 మంది అథ్లెట్లు వెళ్లగా వయో నిబంధనల కారణంగా 18 మంది అసలు పోటీల్లో పాల్గొనకుండానే నిష్క్రమించడంపై విమర్శలకు దిగింది. అథ్లెట్ల ఎంపికలో తీవ్ర తప్పిదాల వల్లే వైఫల్యం చెందారని సాయ్ అధికారులు అన్నారు. టోర్నమెంటు రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అథ్లెటిక్ ఫెడరేషన్ పై నిప్పులు చెరిగారు. సెలక్షన్స్ జరుగుతున్నప్పుడు అతిగా జోక్యం చేసుకోవడం వల్లే దారుణ ఫలితాలు వస్తున్నాయని సాయ్ డైరెక్టర్ జిజి థాంప్సన్ విమర్శించారు.