: హస్తినలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమాలోచనలు
సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు అలెక్స్ భవనంలో సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రేపు ఆంటోనీ కమిటీతో చెప్పాల్సిన అన్ని అంశాలపై చర్చించనున్నారు. నేడు తెలంగాణ ప్రతినిధులంతా ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో జరుగుతున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అధిష్ఠానం కదలికలను తీవ్రంగా గమనిస్తున్న సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆంటోనీ కమిటీ ముందుకు తీసుకువెళ్లాల్సిన అంశాలపై చర్చించనున్నారు. విభజన వల్ల సీమాంధ్రలో పార్టీకి జరిగే తీవ్ర నష్టాన్ని వారు కమిటీకి వివరించనున్నారు.