: సస్పెండ్ చేసినా మా పోరాటం ఆగదు: టీడీపీ ఎంపీలు
పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసినా తమ పోరాటం ఆగదని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. తమను బహిష్కరించి సభను నిర్వహించే కుట్ర జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణకు నేతలు కలిసి రావడం లేదని, ప్రజలకు మాయమాటలు చెబుతూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా తమ పోరాటం ఆగదని వారు తెలిపారు.