: హైదరాబాద్ ను యూటీ చేస్తే అసదుద్దీన్ తో కలిసి ఉద్యమిస్తాం: కేటీఆర్


హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ఉద్యమిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిని నిరసిస్తూ విద్యుత్ సౌధలో ఆ ప్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు హాజరయిన కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ విషయంలో రాజీపడబోమని ఆయన అన్నారు. హైదారాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదని సెలవిచ్చారు. నగరాన్ని యూటీ చేస్తే అసదుద్దీన్ తో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, గతంలో పలుమార్లు అసదుద్దీన్ తెలంగాణను వ్యతిరేకించారు. తన ఓటు సమైక్యానికే అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News