: రాష్ట్రపతి పాలన విధింపు పిటిషన్ పై విచారణ వాయిదా


రాష్ట్రంలో పాలన స్థంభించినందున రాష్ట్రపతి పాలన విధించాలన్న పిటిషన్ పై విచారణను హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటీషన్ పై విచారణను కూడా హైకోర్టు ఈ నెల 26 కు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరం ప్రతినిధులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమ్మెను నిలువరించేందుకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News