: న్యూయార్క్ లో హజారే, విద్యాబాలన్ సందడి
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం భారత స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు న్యూయార్క్ వీధులు భారతీయ జెండాలతో రెపరెపలాడాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే, బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఈ పరేడ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి సమక్షంలో వందల మంది పరేడ్ నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఈ పరేడ్ నిర్వహించింది.