: ప్రజలకు హరికృష్ణ బహిరంగ లేఖ
రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తన ఆత్మప్రబోధం మేరకు సమైక్యాంధ్రకే మద్దతిస్తున్నట్టు లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆత్మ ఆవిష్కరణ పేరిట రాసిన ఈ లేఖలో ఇంకా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగువారి మధ్య ప్రాంతాల కోసం జరుగుతున్న సంఘర్షణల పట్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయంతో ఒక ప్రాంతానికి అన్యాయం జరిగినట్టయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా, విభజన నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అభిప్రాయాన్ని ఒక కార్యకర్తగా గౌరవిస్తానని తెలిపారు.