: దేశ పరువును కాపాడిన ఏకైక విద్యాసంస్థ


బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) భారతదేశ పరువును అంతర్జాతీయంగా మరోసారి నిలబెట్టింది. ప్రపంచ టాప్ యూనివర్సిటీలలో చోటు దక్కించుకోవడంలో మరోసారి భారతీయ ఉన్నత విద్యాసంస్థలు విఫలమయ్యాయి. ఐఐఎస్సీ ఒక్కటే టాప్ 500లో నిలిచింది. 'అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్' ను షాంగై జియోతాంగ్ యూనివర్సిటీలో విడుదల చేశారు. 301 నుంచి 400 వర్సిటీల కేటగిరీలో ఐఐఎస్సీ నిలిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ ఫోర్డ్ వర్సిటీ, కాలిఫోర్నియా వర్సిటీలు మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News