: పాక్ లో 'చెన్నై ఎక్స్ ప్రెస్' పరుగులు
షారూక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' పాకిస్థాన్ లో దుమ్ము దులుపుతోంది. ఈ నెల 9న కరాచీలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లు కురిపిస్తోంది. ఎనిమిది స్క్రీన్లలో ప్రదర్శిస్తుండగా.. మొదటి వారంలోనే 4 కోట్ల రూపాయలు వసూలైందని ఐఎంజీసీ ప్రతినిధి తెలిపారు. ఐఎంజీసీ పాక్ లో అతిపెద్ద చిత్ర పంపిణీ సంస్థ. పాకిస్థాన్ ప్రభుత్వం భారతీయ చిత్రాల ప్రదర్శనకు అనుమతించిన తర్వాత బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హిట్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రమేనని ఐఎంజీసీ ప్రతినిధి చెప్పారు. స్థానికుల నుంచి స్పందన అధికంగా ఉండడంతో టికెట్ల రేట్లు భారీగా పెరిగాయట.