: ఉద్యోగులపై ఎస్మా ప్రయోగం బాధాకరం: బాపిరాజు
సీమాంధ్రలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం పట్ల ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఎస్మా ప్రయోగం దురదృష్టకరమన్నారు. ఇక, తాను సమైక్యాంధ్రకు మద్దతుగా సరైన సమయంలో రాజీనామా చేస్తానని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టుబడిదారులున్నారని వస్తున్న ఆరోపణలను బాపిరాజు ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీమాంధ్రలో నడుస్తున్న ఉద్యమం ప్రజల ఉద్యమమని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల్లో సీఎం కిరణ్ ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తున్నారని, తామంతా ఆయనకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు.