: సింహాల తరలింపునకు సాయం కోరిన మధ్యప్రదేశ్
గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ లోని పాల్పర్ కునో వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సింహాలను తరలించడానికి నిధుల సాయం చేయాలని అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆసియా జాతి సింహాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుండడంతో వాటి పరిరక్షణకు గాను గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ కు తరలించాలని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం తరలించడానికి వీలుగా 7.37కోట్ల రూపాయల నిధులు అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.