: జలాంతర్గామి నుంచి మరో మృతదేహం వెలికితీత
ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి నుంచి శనివారం రాత్రి డైవర్లు మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఇప్పటివరకూ ఆరు మృతదేహాలు బయటపడినట్లయింది. ఇంకా 12 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. మంగళవారం రాత్రి ముంబై తీరంలో నిలిపి ఉంచిన సింధురక్షక్ లో పేలుళ్లు జరగడంతో అగ్నికీలలు ఎగసి అనంతరం జలాంతర్గామి నీట మునిగిన సంగతి తెలిసిందే.