: పుజారా అభి'వంద'నం


సౌరాష్ట్ర డైనమైట్ చటేశ్వర్ పుజారా (107 బ్యాటింగ్) తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రస్టెన్ బర్గ్ లో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న నాలుగురోజుల మ్యాచ్ లో పుజారా సెంచరీ పూర్తి చేశాడు. సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఈ స్టయిలిష్ బ్యాట్స్ మన్ హార్మర్ విసిరిన బంతికి రెండు పరుగులు తీసి ఖాతాలో మరో ఫస్ట్ క్లాస్ సెంచరీ వేసుకున్నాడు. దీంతో, కడపటి వార్తలందేసరికి భారత్-ఎ తన తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పుజారాకు జతగా రోహిత్ శర్మ 50 పరుగులతో ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News