: మీతో కలిసుండేది చెప్పుదెబ్బలు తినడానికా?: దేవీ ప్రసాద్
రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుపతిలో చెప్పులతో దాడి చేయడం పట్ల టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, 'మీతో కలిసుండేది చెప్పుదెబ్బలు తినడానికా?' అని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల వైఖరి తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులపై దాడులు చేయడం ఏ సంస్కృతిలో భాగమని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను హైదారాబాద్ పంపాలని, తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను వారివారి ప్రాంతాలకు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ వినతి పత్రం ఇస్తామని దేవీ ప్రసాద్ వెల్లడించారు.