: సీమాంధ్ర మంత్రుల సమావేశం ప్రారంభం


ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ బొత్స, అహ్మదుల్లా, విశ్వరూప్, సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి, మహీధరరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం, గంటా, తోట నరసింహం తదితరులు హాజరయ్యారు. వీరంతా సీమాంధ్రలో తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగులను ఎలా దారికి తేవాలన్న దానిపై కూడా తర్జనభర్జనలు పడుతున్నట్టు సమాచారం. ఉద్యమంపై అధిష్ఠానానికి ఏం చెప్పాలన్న విషయమే కాకుండా, మరిన్ని పాలనాపరమైన అంశాలపై వీరు చర్చించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News