: సీమాంధ్రలో ఉద్యమాన్ని నడిపిస్తోంది ముఖ్యమంత్రే: విఠల్
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఉద్యమాన్ని కిరణ్ కుమార్ రెడ్డే నడిపిస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో డిసెంబర్ 9 నాటి సంఘటన పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని అక్కడి నేతలు అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దాడులు చేయడాన్ని వెంటనే విరమించుకోవాలని సూచించారు.