: 101 ఏళ్ల వయసులోనూ పరుగో పరుగు


ఒక భారతీయుడు 101 ఏళ్ల వయసులో తన చివరి పరుగుపందేన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆదివారం హాంగ్ కాంగ్ మారథాన్ లో 10 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటా 32 నిమిషాల 28 సెకన్లలో పూర్తి చేశాడు. అతడే  ఫౌజాసింగ్. భారత్ లో పుట్టిన ఫౌజాసింగ్ బ్రిటన్ లో స్థిరపడ్డారు.

 మొదటి నుంచీ ఈయనకు పరుగుపందేల పోటీలలో పాల్గొనడం అంటే మహా ఇష్టం. అది నేటి వరకూ కొనసాగించారు. 101 ఏళ్ల వయసులో చివరి సారిగా ఆదివారం హాంగ్ కాంగ్ మారథాన్ లో పాల్గొన్నారు. ఇకపై ఆయన పరుగుకు దూరం కానున్నారు. అంత పెద్ద వయసులోనూ ఆగకుండా అన్ని గంటలపాటు పరుగెత్తడం నిజంగా వండరే. 

2011లో జపాన్ రాజధాని టొరొంటోలో జరిగిన పూర్తి స్థాయి మారథాన్ పోటీలలో పాల్గొని ఫౌజా సింగ్ చరిత్ర సృష్టించారు. కాకపోతే ఫౌజా పుట్టిన తేదీకి సంబంధించి పాస్ పోర్టు తప్ప ఇతర ఆధారాలు లేకపోవడంతో ఆ రికార్డును గిన్నిస్ బుక్ వారు గుర్తించలేదు. అయితే, ఫౌజా గతంలో పలు విభాగాల మారథాన్ పోటీలలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News