: రెండో రాజధానిగా హైదరాబాదు.. అంబేద్కర్ సూచన పరిశీలించాలి: నారాయణ
హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని అప్పట్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సూచనను కేంద్రం పరిశీలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సూచించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ సూచనలు ఆచరణలో పెడితే అందరికీ ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఇక, సీమాంధ్రలో ఉద్యమాలను అవకాశవాద రాజకీయాలని అభివర్ణించారు. రాజకీయ లబ్ది కోసమే ఉద్యమాలు చేసేందుకు ఆయా పార్టీల నేతలు పోటీలు పడుతున్నారని విమర్శించారు.