: టీ జేఏసీలో ఢిల్లీ పర్యటన చిచ్చు


తెలంగాణ రాజకీయ జేఏసీలో చిచ్చు రేగింది. ముఖ్యనేతలు కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ ల రహస్య ఢిల్లీ పర్యటన పొలిటికల్ జేఏసీ లో చిచ్చు రేపింది. విషయం ఏమిటంటే.. విభజన ప్రకటించి తిరుగులేని శక్తిగా మారాలనుకున్న కాంగ్రెస్ తాననుకున్న ప్రయోజనం చేకూరలేదని భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనతో కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడని ఆశించిన కాంగ్రెస్ కేసీఆర్ నోరు మెదపకపోవడంతో పునరాలోచనలో పడింది. దీంతో పొలిటికల్ జేఏసీని తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది.

అందులో భాగంగానే కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ లు ఢిల్లీ వెళ్లి ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భేటీ అయినట్లు సమాచారం. అయితే ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న కోదండరాం దీనిపై నోరు మెదపలేదు. వీరి పర్యటన పరమార్ధం అంతుచిక్కక తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జేఏసీ ప్రతి అడుగునూ కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని సమాచారం. వీరి హస్తిన పర్యటన జేఏసీలో చీలిక తెస్తుందా? అని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News