: మోడీకి ఆస్ట్రేలియా ఆహ్వానం


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ దార్శనికతకు ముచ్చటపడుతున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది. ఓవైపు అగ్రరాజ్యం అమెరికా మోడీకి వీసా జారీ కష్టమేనంటుండగా.. బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆయన కోసం రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ దేశం వచ్చి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయాలంటూ సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. మొన్న బ్రిటన్ ఎంపీలు ఈ బీజేపీ ప్రచార సారథికి ఇన్విటేషన్ పంపగా.. తాజాగా, భారత్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ పాట్రిక్ సక్లింగ్ గాంధీనగర్ లో మోడీని కలిసి తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా సక్లింగ్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా ప్రాధాన్యం ఇచ్చే దేశాల్లో భారత్ ప్రముఖమైనదని, ఈ క్రమంలో గత పదేళ్ళుగా గుజరాత్ తో సత్సంబంధాలకు ప్రాముఖ్యతనిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News