: ఒబేదుర్ ను ప్రశ్నించిన ఎన్ఐఏ
జంట పేలుళ్ల ఘటనకు సంబంధించి ఎవరిపై అనుమానం వున్నాఎన్ఐఏ వదిలి పెట్టడంలేదు. గత ఏడాది తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు వున్నాయన్నకారణంగా అరెస్టు చేసిన ఒబేదుర్ రెహ్మాన్ ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్నాడు. దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనపై ఒబేదుర్ నుంచి ఏదైనా సమాచారం తెలుసుకోవచ్చునని భావించిన జాతీయ విచారణ సంస్థ అతడిని విచారించిందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.