: ఖుర్షీద్ ఒక బొద్దింక: బీజేపీ ఎదురుదాడి


మోడీని 'కప్ప'గా అభివర్ణిస్తూ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి దీటైన సమాధానమిచ్చారు. ఖుర్షీద్ ను ఓ బొద్దింకతో పోల్చారు. ఖుర్షీద్ విదేశాంగ మంత్రిగా కాకుండా విదేశీయుల మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె దెప్పి పొడిచారు. 'ఒకవేళ పాకిస్థాన్ అణుదాడి జరిపితే ఒక్క ఖుర్షీద్ మాత్రమే బతికి బట్టకడతారు. ఎందుకంటే బొద్దింకలు మాత్రమే అణుదాడిని తట్టుకుని బతకగలవు' అంటూ మీనాక్షి వ్యాఖ్యానించారు. మోడీ ఇప్పుడే బావిలోంచి బయటపడ్డ కప్పని, విశాల ప్రపంచంలో ఆయనకు తగిన స్థానం దొరకడం లేదంటూ ఖుర్షీద్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News