: తిరుమలలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
శ్రావణ మాసం సందర్భంగా తిరుమలలో శ్రీవారికి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆలయంలో దోష పరిహారానికి పవిత్రోత్సవాలను ఏటా నిర్వహించడం ఆనవాయితీ. మరోవైపు బంద్ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ప్రత్యేక దర్శనానికి గంట, సర్వ దర్శనానికి మూడు గంటలే సమయం పడుతోంది.