: అరగుండుతో ఎమ్మెల్యే నిరసన
సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వూరు బస్టాండ్ నుంచి 'రోడ్ కం రైలు' వంతెన వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా, రాష్ట్ర విభజనను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు అరగుండు గీయించుకున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని, తక్షణం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రకటించింది. ఆంటోనీ కమిటీ ఢిల్లీలో కూర్చుని అభిప్రాయ సేకరణ అనడం కాదని, తమ ప్రాంతానికి వస్తే అప్పడు తెలుస్తుందని కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు అన్నారు..