: కస్టమ్స్ అధికారి వేషంలో కోటికి పైగా టోకరా
ఓ మోసగాడు తనను నమ్మిన వ్యక్తిని నిలువునా ముంచాడు. హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో భాస్కర్ భార్గవ్ అనే వ్యక్తి తాను కస్టమ్స్ అధికారిగా చెప్పుకుని కోటీ నలభై మూడు లక్షల రూపాయలకు టోకరా వేశాడు. ఈ వంచకుడు తన వద్ద బంగారం ఉందని, తక్కువ ధరకు ఇస్తానని నమ్మబలకడంతో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అతగాడికి నగదు ముట్టజెప్పాడు. భారీ మొత్తంలో నగదు చేతిలో పడడంతో ఆ నకిలీ కస్టమ్స్ అధికారి ఉడాయించాడు. అయితే, కాసేపటికి జరిగిన మోసం గ్రహించిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.