: పాక్ పదకొండవసారి.. కాల్పుల్లో భారత జవాన్లకు గాయాలు
నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరు రోజుల వ్యవధిలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది పదకొండవసారి. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ వద్ద బాలాకోట్ ప్రాంతంలోఈ ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లకు గాయాలయ్యాయి. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి.