: పథకాలను ఏకరువుపెట్టిన సీఎం కిరణ్


స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం కిరణ్ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రభుత్వ పథకాలను ఏకరువుపెట్టారు. మీ సేవ పథకం నిశ్శబ్ద విప్లవం సృష్టించిందన్నారు. ప్రస్తుతం 20 సూత్రాల పథకం అమలులో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు. 18 ఏళ్ళ తర్వాత రాష్ట్రం ఈ ఘనత సాధించిందని తెలిపారు. ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టాన్ని తెచ్చామని, బాలికల భవిష్యత్తు కోసం బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టామని కిరణ్ వివరించారు. 'అభయ హస్తం' ద్వారా మరో 9 లక్షల మందికి ఆపన్నహస్తం అందించనున్నామని వెల్లడించారు. ఇక త్వరలోనే మూడవదశ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News