: సమరయోధుల పించన్ 7వేలకు.. సీఎం స్వాతంత్ర్య దినోత్సవ వరం
సమర యోధులకు ప్రస్తుతమున్న పించన్ ను నెలకు 4 వేల నుంచి 7వేల రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాంతంత్ర దినోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2,000 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సహా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను సీఎం ఉదహరించారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలో మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.