: ప్రధాని పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ బందోబస్తు


ప్రధాని మన్మోహన్ సింగ్ హైదరాబాదు పర్యటన సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రధాని పర్యటించే పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. ఇందులో భాగంగా నల్గొండ క్రాస్ రోడ్ నుంచి కొత్తపేట వైపు వచ్చే వాహనాలను ఎల్బీనగర్, ఉప్పల్ వైపు దారి మళ్లించారు. ఎల్బీనగర్ నుంచి రాజీవ్ చౌక్ వైపు, సరూర్ నగర్ పోస్టాఫీసు నుంచి హుడా కాంప్లెక్సు వైపు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.

ఎల్బీనగర్,తహసీల్దార్ కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వైపు గల రహదారిని ముందుగానే మూసివేశారు. మరోవైపు ప్రధాని రాకను దృష్టిలో పెట్టుకుని పోలీసులు నగరంలో భారీ భ్రదతా ఏర్పాట్లు చేశారు. మన్మోహన్ పర్యటించే ప్రాంతాలను ఎన్ ఎస్జీ, ఎస్పీజీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు స్వ్కాడ్ లతో తనిఖీలు చేపట్టాయి. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నఆసుప్రతుల పరిసరాల్లోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News