: సమైక్యాంధ్ర సినిమా.. చిరంజీవి హీరో!
సీమాంధ్ర ఉద్యమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన రాంగోపాల్ వర్మ ఏమంటున్నారో వినండి. ప్రజలే రథసారథులుగా నడుస్తున్న ఉద్యమాన్ని సినిమాగా భావిస్తే ఎలా ఉంటుందంటున్నాడు. అంతేగాకుండా కేంద్ర మంత్రి చిరంజీవినీ ఇందులో పాత్రధారిని చేస్తున్నాడు. సమైక్యాంధ్ర ఉద్యమం సినిమా అయితే, అందులో చిరంజీవిని హీరో అనుకుంటే ఇక చెప్పనక్కర్లేదని ట్వీట్ చేశాడు. పనిలోపనిగా తిరుమల వెంకన్ననూ వదల్లేదు వర్మ. టీటీడీ ఉద్యోగులే కాకుండా, శ్రీనివాసుడు, ఆయన ఇష్టసతి పద్మావతి కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటే అద్భుతంగా ఉంటుందన్నాడు.