: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లనున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కోలీజియం జస్టిస్ ఘోష్ పేరును కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసింది.
అక్కడి నుంచి ఆ దస్త్రం రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళిన తర్వాత నియామకం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఘోష్ గత ఏడాది జూన్ 25 న రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన మరో ఐదేళ్ళ పాటు కొనసాగుతారు.