: బక్కచిక్కుతున్న రూపాయి.. పెరిగిన ద్రవ్యోల్బణం
రూపాయి బక్కచిక్కిపోతోంది! డాలర్ బలపడడంతో రూపాయి విలువ క్షీణించిపోతోంది. ఆర్ బీఐ చొరవతో కొద్దికాలం స్థిరంగా కొనసాగిన రూపాయి విలువ ఈరోజు మళ్లీ క్షీణించడం ప్రారంభించింది. ఈరోజు స్టాక్ మార్కెట్ ఆరంభంలోనే 30 పైసలు క్షీణించిన రూపాయి డాలర్ కు వ్యతిరేకంగా 61.50 పైసలుగా నమోదైంది. దీంతో దిగుమతులు మరింత భారం కానున్నాయి. ఒకవైపు రూపాయి విలువను కోల్పోయి దిగజారి పోతుండగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ ద్యవ్యోల్బణం 4.86 నుంచి 5.79 కి పెరిగినట్లు ఆర్ధిక శాఖ పేర్కొంది. అస్సాం, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో చెలరేగుతున్న విభజన ఆందోళనలతో ప్రభుత్వ ఆదాయం క్షీణించి ఆర్ధికశాఖపై ప్రభావం చూపి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్ధికనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.